STOCKS

News


డెటెల్‌ నుంచి అత్యంత చౌక ఎల్‌సీడీ టీవీ

Wednesday 28th November 2018
auto-mobiles_main1543389915.png-22437

న్యూఢిల్లీ: ప్రపంచంలో అత్యంత చౌకగా ఫీచర్‌ ఫోన్లు తయారు చేసే కంపెనీగా పేరున్న డెటెల్‌ తాజాగా చౌకైన ఎల్‌సీడీ టీవీని మార్కెట్లోకి తెచ్చింది. 19 అంగుళాల డీ1 ఎల్‌సీడీ టీవీని రూ.3,999 కే అందిస్తున్నామని డెటెల్‌ మొబైల్‌ అండ్‌ యాక్సెసరీస్‌ తెలిపింది. ప్రపంచంలో ఇదే అత్యంత చౌక టీవీ అని ఎస్‌జీ కార్పొరేట్‌ మొబిలిటి (డెటెల్‌ కంపెనీకి ఇది మాతృసంస్థ) ఎమ్‌డీ యోగేశ్‌ భాటియా చెప్పారు. గత ఏడాది ఆగస్టులో రూ.299కే ఫీచర్‌ ఫోన్‌ను అందించామన్నారు. చౌక ధరల స్మార్ట్‌ టీవీలు మన దగ్గర అందుబాటులో లేవని, ఆ లోటును భర్తీచేయడానికి అందుబాటు ధరల్లో స్మార్ట్‌  టీవీలను అందించాలనుకున్నామని తెలియజేశారు. దాంట్లో భాగంగాగానే ఈ డీ1 ఎల్‌సీడీని మార్కెట్లోకి తెచ్చామని చెప్పారు. 
10 రకాల టీవీలు...
గత ఆర్థిక సంవత్సరంలో రూ.50 కోట్ల ఆదాయం సాధించామని, టీవీల అమ్మకాలు పెరుగుతున్నాయని, ఈ ఆర్థిక సంవత్సంరలో రూ.100 కోట్ల ఆదాయం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని భాటియా చెప్పారు. ఇతర కంపెనీలు అందించలేని ఉత్పత్తులను అందిస్తామని, దేశంలోని మారుమూల ప్రాంతాలకూ చేరతామని తెలిపారు. ప్రస్తుతం 24- 65 అంగుళాల సైజుల్లో వివిధ ఫీచర్లతో కూడిన 10 మోడళ్లలో టీవీలను ఆఫర్‌ చేస్తున్నామని చెప్పారాయన. వీటి ధరలు రూ.9,999 నుంచి రూ.17,999 రేంజ్‌లో ఉన్నాయని పేర్కొన్నారు.  వినియోగదారుల ఎలక్ట్రానిక్స్‌ రంగంలో మరిన్ని కేటగిరీల ఉత్పత్తులను అందించడంపై కసరత్తు చేస్తున్నామని భాటియా తెలిపారు. 



You may be interested

కాలుష్య కారక జెన్‌సెట్లు వద్దు

Wednesday 28th November 2018

న్యూఢిల్లీ: విద్యుత్‌ రంగంలో సంస్కరణల అవసరాన్ని నీతి ఆయోగ్‌ సీఈవో అమితాబ్‌ కాంత్‌ నొక్కి చెప్పారు. డీజిల్‌, కిరోసిన్‌ తదితర ఇంధన ఆధారిత జెన్‌సెట్ల (విద్యుత్‌ జెనరేటర్లు) వినియోగాన్ని నిషేధించాలని కోరారు. కోర్టు ఆదేశించడానికి ముందే ప్రభుత్వం ఈ పనిచేయాలన్నారు. 25 ఏళ్ల కాలం దాటిన బొగ్గు ఆధారిత విద్యుత్‌ ప్లాంట్లను తొలగించాల్సిన అవసరాన్ని కూడా ప్రస్తావించారు. అలాగే, నచ్చిన కంపెనీ నుంచి విద్యుత్‌ కొనుగోలు చేసే అవకాశాన్ని కల్పించాలని

జపాన్‌ కంపెనీ చేతికి ఆటమ్‌ టెక్నాలజీస్‌

Wednesday 28th November 2018

ముంబై: భారత దేశ పేమెంట్‌ సేవల మార్కెట్లోకి జపాన్‌కు చెందిన ఎన్‌టీటీ డేటా ప్రవేశించింది. 63-మూన్స్‌ యాజమాన్యంలోని చెల్లింపుల సేవల సంస్థ, ఆటమ్‌ టెక్నాలజీస్‌లో నియంత్రిత వాటాను ఎన్‌టీటటీ డేటా కొనుగోలు చేసింది. ఆటమ్‌ టెక్నాలజీస్‌లో 55.35 శాతం వాటాను 92.4 లక్షల డాలర్లకు ఎన్‌టీటీ డేటా కొనుగోలు చేసిందని 63 మూన్స్‌ ఎమ్‌డీ, చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఎస్‌.రాజేంద్రన్‌ చెప్పారు. అంతేకాక ఈ జపాన్‌ సంస్థ మరో 15 లక్షల

Most from this category