STOCKS

News


అధునాతన ‘డాట్సన్ గో, గో ప్లస్’ కార్లు విడుదల

Thursday 11th October 2018
auto-mobiles_main1539231657.png-21032

చెన్నై: జపనీస్‌ ఆటోమేకర్‌ నిస్సాన్‌.. పండుగల సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని  ‘డాట్సన్ గో, గో ప్లస్’  కార్లలో కొత్త వేరియంట్లను మంగళవారం భారత మార్కెట్‌లో విడుదలచేసింది. దాదాపు 100కు పైగా అప్‌డేట్స్‌, 28 నూతన ఫీచర్లు ఈ వేరియంట్లలో ఉన్నట్లు ప్రకటించింది. గో బ్రాండ్‌ ధర రూ.3.29 లక్షలు కాగా, గో ప్లస్ ధర రూ.3.83 లక్షలుగా వెల్లడించింది. ఈ సందర్భంగా నిస్సాన్‌ ఇండియా మోటార్స్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ (మార్కెటింగ్‌) పీటర్ క్లిస్‌సోల్డ్‌ మాట్లాడుతూ.. ‘ద్వితియ, తృతియ శ్రేణి నగరాల లక్ష్యంగా నూతన ఆవిష్కరణలను కొనసాగిస్తున్నాం. కారును కొనుగోలు చేసే ముందు కస్టమర్లు డీలరు వద్దకు వెళ్లి సర్వీస్‌ బాగుందనే విషయం తెలుసుకున్న తరువాత మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం 270 అవుట్‌లెట్లు ఉండగా.. ఈ ఏడాదిలో మరింత మంది డీలర్లు జతకానున్నారని అంచనావేస్తున్నాం. ఇక ఎగుమతుల విషయానికి వస్తే.. దక్షిణ ఆఫ్రికా, నేపాల్‌తో పాటు మరి కొన్ని దేశాలకు ఎక్స్‌పోర్ట్స్‌ కొనసాగుతున్నాయి. తాజా వేరియంట్లలో మరింత సౌకర్యవంత, సురక్షితమైన జపనీస్ ఇంజినీరింగ్ టెక్నాలజీ ఉంది.’ అని వ్యాఖ్యానించారు.



You may be interested

38 శాతం తగ్గిన జీ ఎంటర్‌టైన్మెంట్‌ లాభం

Thursday 11th October 2018

న్యూఢిల్లీ:  జీ ఎంటర్‌టైన్మెంట్‌ ఎంటర్‌ప్రైజెస్‌ లిమిటెడ్‌(జడ్‌ఈఈఎల్‌) నికర లాభం(కన్సాలిడేటెడ్‌) ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌ క్వార్టర్‌లో 38 శాతం తగ్గింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ2లో రూ.625 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో రూ.386 కోట్లకు తగ్గిందని జీ ఎంటర్‌టైన్మెంట్‌ ఎంటర్‌ప్రైజెస్‌ తెలిపింది. మొత్తం ఆదాయం మాత్రం రూ.1,785 కోట్ల నుంచి 14 శాతం వృద్ధి చెంది రూ.2,035 కోట్లకు పెరిగిందని కంపెనీ ఎమ్‌డీ, సీఈఓ పునీత్‌ గోయెంకా

టాప్‌ గేర్‌లో మారుతి సియాజ్

Thursday 11th October 2018

న్యూఢిల్లీ: ప్రీమియం సెడాన్‌ విభాగంలో మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్‌ఐ) సియాజ్ టాప్‌ గేర్‌లో దూసుకుపోతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సర తొలి అర్థభాగంలో 24,000 కార్ల విక్రయం నమోదైనట్లు కంపెనీ ప్రకటించింది. ఈ క్యాటగిరీలో 28.8 శాతం మార్కెట్‌ వాటాను కలిగిఉన్నట్లు సంస్థ సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆర్.ఎస్. కల్సీ వెల్లడించారు. 2014లో విడుదలైన సెడాన్‌.. ఇప్పటివరకు 2.34 లక్షల యూనిట్ల విక్రయాలను నమోదుచేసింది. ఆగస్టులో విడుదలైన వెర్షన్‌ బుకింగ్స్‌

Most from this category