బీఎండబ్ల్యూ 3 సిరీస్ గ్రాన్ టురిస్మోలో కొత్త వేరియంట్
By Sakshi

న్యూఢిల్లీ: జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ కంపెనీ ‘బీఎండబ్ల్యూ’ తాజాగా తన ‘3 సిరీస్ గ్రాన్ టురిస్మో’లో కొత్త వేరియంట్ ‘320డి గ్రాన్ టురిస్మో స్పోర్ట్’ కారును భారత్ మార్కెట్లోకి తీసుకువచ్చింది. దీని ఎక్స్‌షోరూమ్ ధర రూ.46.6 లక్షలు. బీఎండబ్ల్యూ ఈ మోడల్‌ను చెన్నై ప్లాంటులో తయారు చేస్తోంది. 320డి గ్రాన్ టురిస్మో స్పోర్ట్‌లో 2 లీటర్ 4 సిలిండర్ డీజిల్ ఇంజిన్‌ను అమర్చినట్లు కంపెనీ తెలిపింది. ఇందులో ఆరు ఎయిర్‌బ్యాగ్స్, యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్, బ్రేక్ అసిస్ట్, డైనమిక్ స్టెబిలిటీ కంట్రోల్, డైనమిక్ ట్రాక్షన్ కంట్రోల్, కార్నరింగ్ బ్రేక్ కంట్రోల్, సైడ్ ఇంపాక్ట్ ప్రొటెక్షన్, క్రాష్ సెన్సర్ వంటి పలు ప్రత్యేకతలున్నాయని వివరించింది.
You may be interested
పన్ను వివాదాలు తగ్గుతాయి: పియుష్ గోయల్
Thursday 12th July 2018న్యూఢిల్లీ: పన్నుపరమైన వివాదాలపై ఆదాయ పన్ను శాఖ అప్పీళ్లకు సంబంధించిన పరిమితులను పెంచడంతో వ్యాజ్యాలు కొంత మేర తగ్గగలవని కేంద్ర ఆర్థిక మంత్రి పియుష్ గోయల్ తెలిపారు. న్యాయవ్యాజ్యాల్లో చిక్కుకున్న పన్ను మొత్తాల పరిమాణం రూ. 5,600 కోట్ల మేర తగ్గవచ్చని వివరించారు. ప్రస్తుతం వివిధ ట్రిబ్యునల్స్, హైకోర్టులు, సుప్రీం కోర్టులో సుమారు రూ. 7.6 లక్షల కోట్ల మేర పన్ను మొత్తాలు లిటిగేషన్లో ఉన్నట్లు పేర్కొన్నారు. వ్యాజ్యాలను తగ్గించే
యాంబీ వ్యాలీని కొనేవారు లేరు
Thursday 12th July 2018న్యూఢిల్లీ: సహారా యాంబీవ్యాలీ వేలం ప్రక్రియను నిలిపివేశామని, వేలం నోటీసుకు ఎటువంటి స్పందన లభించకపోవడమే దీనికి కారణమని బోంబే హైకోర్టు అధికారిక లిక్విడేటర్ సుప్రీంకోర్టుకు తెలియజేశారు. అయితే, ఇన్వెస్టర్ల డబ్బులు చెల్లించేందుకు గాను ఈ ఆస్తుల వేలం ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాలని లిక్విడేటర్‌ను చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా,, జస్టిస్ రంజన్ గొగోయ్, ఏకే సిక్రిలతో కూడిన ధర్మాసనం ఆదేశించింది. ఇక, ముంబైలోని వాసాయ్ వద్దనున్న తమ ఆస్తులను కొనుగోలు