STOCKS

News


మాస్‌ మార్కెట్లోకి బెనెల్లి

Saturday 1st December 2018
auto-mobiles_main1543642767.png-22539

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: ప్రీమియం బైక్‌ల బ్రాండ్‌ బెనెల్లి... భారత్‌లో మాస్‌ మార్కెట్‌ను టార్గెట్‌ చేస్తోంది. ఇందుకోసం 200 సీసీలోపు సామర్థ్యం ఉన్న ద్విచక్ర వాహనాలను మార్కెట్లోకి తేబోతోంది. అంతర్జాతీయంగా ఈ విభాగంలో కంపెనీ ఇప్పటికే ఏడు మోడళ్లను అందుబాటులో ఉంచింది. వీటిలో 125 సీసీ, 150, 175 సీసీ స్కూటర్లు కూడా ఉన్నాయి. ‘‘ఇవన్నీ కూడా 2020లో భారతీయ రోడ్లపై పరుగులు పెడతాయి’’ అని బెనెల్లి ఇండియా ఎండీ వికాస్‌ జబక్‌ శుక్రవారమిక్కడ మీడియాకు వెల్లడించారు. ఆ సమయానికి తమ తయారీ కేంద్రం కూడా రెడీ అవుతుందని, ఆ ప్లాంటులో ఇవి రూపుదిద్దుకుంటాయని చెప్పారాయన. 200 సీసీలోపు మోడళ్ల ధర ఎక్స్‌షోరూంలో రూ.2 లక్షల లోపే ఉంటుందని పేర్కొన్నారు. ధర ఆకర్షణీయంగా ఉంటుందని చెప్పారు. ఇంటర్నేషనల్‌ మార్కెట్లో బెనెల్లి ప్రస్తుతం 18 రకాల మోడళ్లను విక్రయిస్తోంది.
డిసెంబరులో మూడు మోడళ్లు..
మహవీర్‌ గ్రూప్‌ కంపెనీ అయిన ఆదీశ్వర్‌ ఆటోరైడ్‌ ఇండియా (ఏఏఆర్‌ఐ) భారత్‌లో బెనెల్లి పంపిణీదారుగా ఉంది. హైదరాబాద్‌లో ఏఏఆర్‌ఐ అసెంబ్లింగ్‌ ప్లాంటును నెలకొల్పింది. ఈ కేంద్రంలో డిసెంబరు తొలి వారంలో ద్విచక్ర వాహనాల అసెంబ్లింగ్‌ మొదలు కానుంది. రెండో వారం నుంచి ఇవి విక్రయ కేంద్రాలకు చేరతాయని వికాస్‌ వెల్లడించారు. ‘అసెంబ్లింగ్‌ ప్లాంటు కోసం కంపెనీ రూ.20 కోట్లు పెట్టుబడి పెట్టింది. వార్షిక సామర్థ్యం ఒక షిఫ్టుకు 7,000 యూనిట్లు. బెనెల్లి టీఎన్‌టీ 300, 302ఆర్‌, టీఎన్‌టీ 600ఐ బైక్‌లను రీలాంచ్‌ చేస్తున్నాం. వీటి ధరలు ఎక్స్‌ షోరూంలో వరుసగా రూ.3,50,000, రూ.3,70,000, రూ.6,20,000గా ఉంటాయి. అయిదేళ్ల వారంటీ ఇస్తున్నాం. ప్రస్తుతం 15 డీలర్‌షిప్‌ కేంద్రాలున్నాయి. మరో 25 కేంద్రాలు మార్చికల్లా రానున్నాయి’ అని వివరించారు.

 



You may be interested

డేటా భద్రత బిల్లుపై విస్తృత చర్చలు..

Saturday 1st December 2018

న్యూఢిల్లీ: వ్యక్తిగత డేటా భద్రత బిల్లు ముసాయిదాపై అంతర్‌ మంత్రిత్వ శాఖలతో పాటు సంబంధిత వర్గాలతో విస్తృతంగా చర్చలు జరపనున్నట్లు కేంద్ర ఐటీ, న్యాయ శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ తెలిపారు. దీన్ని సాధ్యమైనంత త్వరగా అమల్లోకి తెచ్చేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలియజేశారు. ప్రతిపాదిత చట్టాన్నొక 'మైలురాయి'గా అభివర్ణించిన రవి శంకర్ ప్రసాద్.. ముసాయిదా బిల్లుపై కూలంకషంగా చర్చలు జరపాలని, అభిప్రాయాలు సేకరించాలని అధికారులకు సూచించినట్లు తెలిపారు.

ప్రపంచం నంబర్‌-1పై ఓయో కన్ను

Saturday 1st December 2018

న్యూఢిల్లీ: దేశంలో అతిపెద్ద హోటల్‌ బ్రాండ్‌గా అవతరించిన ఓయో... ప్రపంచంలోనూ టాప్‌ హోటల్‌ బ్రాండ్‌గా అవతరించాలన్న లక్ష్యంతో ముందుకెళుతోంది. గదుల సంఖ్య పరంగా దేశంలో ఓయో అగ్ర స్థానంలో ఉంది. వచ్చే నాలుగైదేళ్లలో అంతర్జాతీయంగా లక్షలాది హోటల్‌ గదులను తన నెట్‌వర్క్‌ పరిధిలో చేర్చుకోవడం ద్వారా మారియట్‌ను వెనక్కి నెట్టి ప్రపంచ నంబర్‌-1 హోటల్‌ బ్రాండ్‌గా అవతరించాలనే లక్ష్యం పెట్టుకుంది. ప్రస్తుతం అమెరికాకు చెందిన మారియట్‌ అంతర్జాతీయంగా అతిపెద్ద హోటల్‌

Most from this category