STOCKS

News


మార్కెట్‌లోకి కొత్త ‘పల్సర్‌ 150’

Thursday 29th November 2018
auto-mobiles_main1543486984.png-22491

ప్రముఖ వాహన తయారీ కంపెనీ బజాజ్‌ ఆటో తాజాగా తన పల్సర్‌ 150 నియాన్‌ బైక్‌లో అప్‌గ్రేడ్‌ వెర్షన్‌ను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. దీని ఎక్స్‌షోరూమ్‌ (ఢిల్లీ) ధర రూ.64,998. కొత్త లుక్‌, మంచి పనితీరు కోరుకునే కస్టమర్లకు తొలి ఎంపికగా పల్సర్‌ 150 నియాన్‌ ఉంటుందని బజాజ్‌ ఆటో ప్రెసిడెంట్‌ (మోటార్‌సైకిల్స్‌) ఎరిక్‌ వాస్‌ తెలిపారు. కొత్త పల్సర్‌.. నియాన్‌ రెడ్‌, నియాన్‌ ఎల్లో, నియాన్‌ సిల్వర్‌ అనే మూడు రంగుల్లో కస్టమర్లకు అందుబాటులో ఉండనుంది. ఇందులో 5 స్పీడ్‌ గేర్‌ బాక్స్‌తో కూడిన 149 సీసీ ఎయిర్‌ కూల్డ్‌ సింగిల్‌ సిలిండర్‌ ఇంజిన్‌ అమర్చినట్లు కంపెనీ తెలిపింది. హెడ్‌ల్యాంప్‌ ఐబ్రో, ప్రత్యేకమైన పల్సర్‌ లోగో వంటి పలు ప్రత్యేకతలున్నాయని పేర్కొంది. 



You may be interested

ఫండ్‌ హౌస్‌లకు రూ.700 కోట్లు చెల్లించిన రాణా కపూర్‌..!

Thursday 29th November 2018

ముంబై: ప్రైవేట్ రంగానికి చెందిన యస్‌ బ్యాంక్‌ షేరు ధర గడిచిన రెండు రోజుల్లోనే 20 శాతానికి మించి నష్టపోయింది. గురువారం ట్రేడింగ్‌లో రూ.146.75 వద్దకు క్షీణించి 52 వారాల కనిష్టస్థాయిని తిరగరాసింది. ఇంతటి భారీ స్థాయిలో షేరు ధర పతనం కావడంతో బ్యాంకు డిబెంచర్లను కొనుగోలుచేసిన మ్యూచువల్‌ ఫండ్‌ హౌస్‌ల నుంచి ప్రమోటర్లపై ఒత్తిడి పెరుగుతున్నట్లు తెలుస్తోంది. యస్‌ బ్యాంక్‌ హోల్డింగ్‌ కంపెనీలైన యస్‌ సెక్యూరిటీస్‌, మోర్గాన్‌ క్రెడిట్స్‌

10850పైన నిఫ్టీ

Thursday 29th November 2018

మార్కెట్‌కు కలిసొచ్చిన పావెల్‌ వాఖ్యలు నాలుగోరోజూ లాభాలే ఫెడ్‌ రిజర్వ్‌ వడ్డీరేట్ల పెంపుపై అంచనాలు సన్నగిల్లడంతో పాటు డాలర్‌ మారకంలో రూపాయి 3నెలల గరిష్టానికి బలపడటంతో నవంబర్‌ నెల ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ చివరి రోజు మార్కెట్ భారీ లాభంతో ముగిసింది. అంతర్జాతీయంగా బ్రెంట్‌ క్రూడాయిల్‌ ధర 58డాలర్లకు చేరుకోవడంతో రేపు జరిగే జీ-20 సదస్సులో అమెరికా-చైనా దేశాల మధ్య వాణిజ్య యుద్ధ చర్చలు సానుకూల ఫలితాలు వెలువడవచ్చనే అశావహన అంచనాలు మార్కెట్‌

Most from this category