News


పాత వాహనాల రిప్లేస్‌మెంట్‌కు ప్రోత్సాహకాలివ్వాలి..

Monday 17th December 2018
auto-mobiles_main1545035188.png-22998

న్యూఢిల్లీ: వాహనదారులు కాలుష్యకారక పాత వాహనాల స్థానంలో కొత్త వాహనాలను కొనుగోలు చేసేందుకు ప్రోత్సహించే దిశగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆటోమొబైల్ పరిశ్రమ కోరింది. ఇందులో భాగంగా 2000కు పూర్వం రిజిస్టరయిన వాహనాలను రీప్లేస్‌ చేసేందుకు పన్నులపరంగా రిబేట్ ఇవ్వడం వంటి వన్‌ టైమ్ ప్రోత్సాహకాలను పరిశీలించవచ్చని పేర్కొంది. భారీ పరిశ్రమల శాఖ నిర్వహించిన ప్రీ-బడ్జెట్‌ సమావేశంలో ఆటోమొబైల్ సంస్థల ప్రతినిధులు ఈ మేరకు అభిప్రాయం తెలిపారు.  దాదాపు 15 ఏళ్ల పైబడి, సరైన నిర్వహణ లేని వాహనాలే 80 శాతం కాలుష్యం, ప్రమాదాలకు కారణమవుతున్న నేపథ్యంలో వాటిని రీప్లేస్ చేయాల్సిన అవసరం ఉందని వివరించారు. ఇందుకోసం తొలిసారిగా ఉద్గార ప్రమాణాలను అమల్లోకి తెచ్చిన ఏడాది 2000కన్నా ముందు రిజిస్టరయిన వాహనాలను రీప్లేస్ చేయాల్సి ఉంటుందని పరిశ్రమవర్గాలు పేర్కొన్నాయి. జీఎస్‌టీ, రోడ్‌ ట్యాక్స్‌లలో రిబేటు, సబ్సిడీ రుణాలు మొదలైన రూపాల్లో ప్రోత్సాహకాలివ్వొచ్చని సిఫార్సు చేశాయి. 
పన్నులు క్రమబద్ధీకరించాలి ..
ప్యాసింజర్ కార్లపై బహుళ పన్నులను ఎత్తివేయాలని, ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రత్యేక రేటును వర్తింపచేయాలని ఆటోమొబైల్ సంస్థల ప్రతినిధులు కోరారు. 2011-12లో వివిధ రకాల వాహనాలపై 10 శాతంగా ఉన్న పన్నులు 2015-16 నాటికి 12.5 శాతానికి, పెద్ద కార్లపై 22 శాతం నుంచి 30 శాతానికి పెరిగాయి. వీటికి తోడు 2016-17లో 1 శాతం నుంచి 4 శాతం దాకా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సెస్సు కూడా విధిస్తుండటం కొనుగోళ్లపై ప్రభావం చూపుతోంది. ప్రస్తుతం ఆటోమొబైల్స్‌కు గరిష్ట జీఎస్‌టీ శ్లాబ్‌ 28 శాతం వర్తిస్తోంది. ఇంజిన్ పరిమాణం తదితర అంశాలను బట్టి అదనంగా 1 - 15 శాతం దాకా సెస్సు కూడా ఉంటోంది. ఈ నేపథ్యంలో దీర్ఘకాలంలో వాహనాలపై పన్నులను క్రమబద్ధీకరించాలని పరిశ్రమ వర్గాలు కోరాయి. You may be interested

చర్చల పురోగతి సంకేతాలు..

Monday 17th December 2018

న్యూఢిల్లీ: వాణిజ్య యుద్ధభయాలతో ప్రపంచ మార్కెట్లను బెంబేలెత్తించిన అమెరికా-చైనాల మధ్య చర్చలు ఫలింవచ్చని ఇన్వెస్టర్లలో ఆశాభావం పెరుగుతోంది. వివాదాల పరిష్కారానికి రెండు దేశాల మధ్య కుదిరిన 90 రోజుల సయోధ్య ఒప్పందంపై చర్చలు పురోగమిస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయని పరిశీలకులు చెబుతున్నారు. చైనా టెలికం దిగ్గజం హువావే సీఎఫ్‌వో మింగ్‌ కెనడాలో అరెస్టయినప్పటికీ .. రెండు పక్షాల నుంచి పరస్పరం రెచ్చగొట్టుకునే ప్రకటనలేమీ లేకపోవడం ఇందుకు నిదర్శనమని వారు అభిప్రాయపడ్డారు. ఈ

త్వరలో భారత్‌22 ఈటీఎఫ్‌ మూడో విడత ఇష్యూ

Monday 17th December 2018

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం నిధుల సమీకరణ ప్రణాళికల్లో భాగంగా మూడో విడత భారత్‌-22 ఈటీఎఫ్‌ ఇష్యూకు సిద్ధమవుతోంది. వచ్చే ఫిబ్రవరిలో ఇష్యూ ద్వారా రూ.10,000 కోట్లు సమీకరించాలనుకుంటోంది. భారత్‌-22 ఎక్సేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్‌ గత రెండు ఇష్యూల ద్వారా కేంద్ర ప్రభుత్వం రూ.22,900 కోట్లను సమీకరించింది. 2017 నవంబర్‌లో తొలి విడత రూ.14,500 కోట్లు, 2018 జూన్‌లో మలివిడత రూ.8,400 కోట్లు రాబట్టుకుంది. ‘‘మూడో విడత ఇష్యూ ఫిబ్రవరిలో ప్రారంభించే

Most from this category