STOCKS

News


ఆసస్‌ కొత్త ఫోన్‌.. జెన్‌ఫోన్‌ మ్యాక్స్‌ ప్రో ఎం2

Saturday 1st December 2018
auto-mobiles_main1543651890.png-22565

తైవాన్‌కు చెందిన ప్రముఖ మొబైల్‌ హ్యాండ్‌సెట్స్‌ తయారీ కంపెనీ ’ఆసస్‌’ తాజాగా మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను భారత్‌లోకి తీసుకువచ్చేందకు రెడీ అయ్యింది. డిసెంబర్‌ 11న జెన్‌ఫోన్‌ మ్యాక్స్‌ ప్రో ఎం2 స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లో ఆవిష్కరించనుంది. ఈ ఫోన్‌ కేవలం ఫ్లిప్‌కార్ట్‌లో మాత్రమే కస్టమర్లకు అందుబాటులో ఉండనుంది. జెన్‌ఫోన్‌ మ్యాక్స్‌ ప్రో ఎం2 స్మార్ట్‌ఫోన్‌లో నాచ్‌ డిస్‌ప్లే, కార్నింగ్‌ గొరిల్లా గ్లాస్‌-6 ప్రొటెక‌్షన్‌ వంటి ప్రత్యేకతలున్నాయని కంపెనీ పేర్కొంది. అయితే మిగతా ఫీచర్ల గురించి తెలియాల్సి ఉంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.3 అంగుళాల డిస్‌ప్లే, 4 జీబీ/ 6 జీబీ ర్యామ్‌, 64 జీబీ/ 128 జీబీ మెమరీ, స్నాప్‌డ్రాగన్‌ 660 ఏఐఈ ప్రాసెసర్‌, ఆండ్రాయిడ్‌ 9 పై ఆపరేటింగ్‌ సిస్టమ్‌, 5,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ వంటి ప్రత్యేకతలు ఉండొచ్చనే అంచనాలున్నాయి. కాగా మిడ్‌ రేంజ్‌ స్మార్ట్‌ఫోన్లలో జెన్‌ఫోన్‌ మ్యాక్స్‌ ప్రో ఎం2 అత్యంత మన్నికైన ఫోన్‌ అని కంపెనీ పేర్కొంటోంది. 



You may be interested

సెబీకి పెనాల్టీ చెల్లించిన ఝున్‌ఝన్‌వాలా

Saturday 1st December 2018

ముంబై:- ప్రముఖ ఇన్వెస్టర్‌ రాకేశ్‌ఝున్‌ఝున్‌వాలా ఇన్‌సైడ్‌ ట్రేడింగ్‌ ఆరోపణల వివాదాన్ని పరిష్కరించుకున్నట్లు శుక్రవారం మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీ వెల్లడించింది. గతేడాదిలో హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ అనుబంధ సంస్థ జీయోమెట్రిక్‌ షేర్ల ట్రేడింగ్‌లో ఝున్‌ఝున్‌వాలా నియమ నిబంధనలకు విరుద్ధంగా ఇన్‌సైడ్‌ ట్రేడింగ్‌కు పాల్పడినట్లు గుర్తించి న్యాయపరమైన చర్యలకు పూనుకుంది. ఈ వివాదాన్ని ఝున్‌ఝున్‌వాలా రూ.2.48లక్షల పెనాల్టీ చెల్లింపు ద్వారా సెటిల్‌మెంట్‌ చేసుకున్నట్లు సెబి తెలిపింది. కుదర్చుకున్న సెటిల్‌మెంట్‌లో భాగంగా ఇకపై ఎలాంటి

ఎంవోఐఎల్‌ టార్గెట్‌ ఎంత?

Saturday 1st December 2018

ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థ కోటక్‌ సెక్యూరిటీస్‌ తాజాగా ఎంవోఐఎల్‌పై బుల్లిష్‌గా ఉంది. స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేసింది. టార్గెట్‌ ప్రైస్‌ను రూ.260గా నిర్ణయించింది. కంపెనీ ప్రస్తుత క్యూ2 ఆదాయం అంచనాలు మించిందని పేర్కొంది. అధిక విక్రయాలు ఇందుకు కారణమని తెలిపింది. ధరల పెంపు కూడా సానుకూల ప్రభావం చూపిందని పేర్కొంది. మాంగనీస్‌ ఓర్‌ విక్రయాలు వార్షికంగా 17 శాతం, త్రైమాసికంగా 28 శాతం పెరిగాయని తెలిపింది. పీఏటీ అంచనాల

Most from this category