STOCKS

News


అందుబాటు ధరలో ఆసస్‌ 2 కొత్త స్మార్ట్‌ఫోన్స్‌

Wednesday 17th October 2018
auto-mobiles_main1539770814.png-21246

తైవాన్‌కు చెందిన మొబైల్‌ హ్యాండ్‌సెట్స్‌ తయారీ కంపెనీ ‘ఆసస్‌’ తాజాగా అందుబాటు ధరల్లో అదిరిపోయే ఫీచర్లతో రెండు బడ్జెట్‌ స్మార్ట్‌ఫోన్లను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. అవేంటో చూస్తే.. 

ఆసస్‌ జెన్‌ఫోన్‌ మ్యాక్స్‌ ఎం1 @ 7,499
కంపెనీ ‘జెన్‌ఫోన్‌ మ్యాక్స్‌ ఎం1’ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లో ఆవిష్కరించింది. దీని ధర రూ.8,999గా ఉంది. అయితే పండుగ సేల్‌లో ఫ్లిప్‌కార్ట్‌లో ఇది రూ.7,499కు లభ్యంకానుంది. విక్రయాలు ఎప్పటి నుంచి ఉంటాయో తెలియాల్సి ఉంది. ఫోన్‌లోని ప్రత్యేకతలను గమనిస్తే..
♦ 5.45 అంగుళాల హెచ్‌డీ ప్లస్‌ డిస్‌ప్లే
♦ 3 జీబీ ర్యామ్‌
♦ 32 జీబీ మెమరీ
♦ 13 ఎంపీ రియర్‌ కెమెరా
♦ 8 ఎంపీ ఫ్రంట్‌ కెమెరా
♦ 4,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ
♦ క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 430 ప్రాసెసర్‌
♦ ఆండ్రాయిడ్‌ ఓరియో ఓఎస్‌
♦ ఫింగర్‌ప్రింట్‌ సెన్సర్‌

ఆసస్‌ జెన్‌ఫోన్‌ లైట్‌ ఎల్‌1 @ 5,999
కంపెనీ జెన్‌ఫోన్‌ లైట్‌ ఎల్‌1 అనే మరొక స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లో ఆవిష్కరించింది. దీని ధర రూ.6,999గా ఉంది. ఈ ఫోన్‌ పండుగ సేల్‌లో ఫ్లిప్‌కార్ట్‌లో రూ.5,999కు లభ్యం కానుంది. విక్రయాలు ఎప్పటి నుంచి ఉంటాయో తెలియాల్సి ఉంది. ఇందులోని ‍ప్రత్యేకతలను గమనిస్తే..
♦ 5.45 అంగుళాల హెచ్‌డీ ప్లస్‌ డిస్‌ప్లే
♦ 2 జీబీ ర్యామ్‌
♦ 16 జీబీ మెమరీ
♦ 13 ఎంపీ రియర్‌ కెమెరా
♦ 5 ఎంపీ ఫ్రంట్‌ కెమెరా
♦ 3,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ
♦ క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 430 ప్రాసెసర్‌
♦ ఆండ్రాయిడ్‌ ఓరియో ఓఎస్‌
♦ ఫింగర్‌ప్రింట్‌ సెన్సర్‌ ఉండదు



You may be interested

రెండు రోజుల లాభాలు మాయం..!

Wednesday 17th October 2018

10500 మార్కును కోల్పోయిన నిఫ్టీ 383 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్‌ రెండు రోజుల లాభాల ర్యాలీకి బుధవారం బ్రేక్‌ పడింది. అటో, ఆర్థిక, బ్యాంకింగ్‌, మెటల్‌, ఫార్మా, ఎన్‌బీఎఫ్‌సీ రంగ షేర్లలో వెల్లువెత్తిన అనూహ్యంగా వెల్లువెత్తిన అమ్మకాలతో సూచీలు రెండు రోజుల లాభాలూ... ఈ ఒక్కరోజులోనే మాయమయ్యాయి. సెన్సెక్స్‌ 383 పాయింట్లు కోల్పోయి 34,779 వద్ద, నిఫ్టీ 132 పాయింట్లు నష్టపోయి 10,453 వద్ద ముగిశాయి. నిఫ్టీ బ్యాంకు ఇండెక్స్‌ 400 పాయింట్ల నష్టంతో 25,188

రానున్న వారాల్లో విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు తీవ్రతరం

Wednesday 17th October 2018

ఇండియన్‌ మార్కెట్‌లో విదేశీ ఇన్వెస్టర్లు రానున్న వారాల్లో నికరంగా చూస్తే విక్రయదారులుగా ఉంటారు తప్ప కొనుగోలుదారులుగా ఉండరని మార్నింగ్‌స్టార్‌ అడ్వైజర్స్‌ ఇండియా సీనియర్‌ రీసెర్చ్‌ అనలిస్ట్‌ హిమాంశు శ్రీవాత్సవ తెలిపారు. ఏవైనా ఊహించని మార్పులు చోటుచేసుకుంటే.. అప్పుడు పైన చెప్పినదానికి మినహాయింపు ఇవ్వొచ్చని పేర్కొన్నారు. ఆయన ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలు వెల్లడించారు.   గత కొన్ని వారాలను గమనిస్తే ఎఫ్‌ఐఐలు ఇండియన్‌ ఈక్విటీ మార్కెట్‌లో సెల్లింగ్‌ బటన్‌ను

Most from this category