STOCKS

News


కొత్త ఐఫోన్‌ టెన్‌ఎస్‌ వచ్చేసింది ..

Thursday 13th September 2018
auto-mobiles_main1536813385.png-20214

క్యుపర్టినో, కాలిఫోర్నియా: టెక్‌ దిగ్గజం యాపిల్‌ తాజాగా కొత్త ఐఫోన్‌తో పాటు పలు ఉత్పత్తులను ప్రవేశపెట్టింది. బుధవారమిక్కడ జరిగిన కార్యక్రమంలో కంపెనీ సీఈవో టిమ్‌ కుక్‌.. ఐఫోన్‌ టెన్‌ఎస్‌ ఫోన్లను  ఆవిష్కరించారు. 5.8 అంగుళాలు, 6.5 అంగుళాల (ఐఫోన్‌ టెన్‌ఎస్‌ మ్యాక్స్‌) ఓఎల్‌ఈడీ డిస్‌ప్లేతో ఇవి లభిస్తాయి.  512 జీబీ దాకా మెమరీ ఉంటుంది.  
వీటితో పాటు వాచ్‌లకు సంబంధించి సిరీస్‌ 4ను కూడా యాపిల్‌ ప్రవేశపెట్టింది. పాత వాటితో పోలిస్తే ఈ వాచ్‌ల స్క్రీన్‌ 30 శాతం పెద్దదిగా ఉంటుంది. కిందపడిపోయే అవకాశాలను కూడా ముందే గుర్తించి హెచ్చరించగలిగే చిప్‌ను ఇందులో పొందుపర్చారు. గుండె కొట్టుకునే వేగాన్ని లెక్కిస్తుంది. 30 సెకన్లలో ఈసీజీ కూడా తీసుకునే అవకాశం కల్పిస్తుంది. వీటి ధర 399 డాలర్ల నుంచి ప్రారంభమవుతుంది. 
 



You may be interested

చిన్న చమురు క్షేత్రాల్లోకి రూ.8,400 కోట్ల పెట్టుబడులు

Thursday 13th September 2018

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: చిన్న స్థాయి చమురు, సహజ వాయువు నిక్షేపాల రెండవ రౌండు వేలం అనంతరం ఆయా క్షేత్రాల్లోకి సుమారు రూ.8,400 కోట్ల పెట్టుబడులొచ్చే అవకాశం ఉందని డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ హైడ్రోకార్బన్స్‌ (డీజీహెచ్‌) వి.పి.జాయ్‌ అంచనా వేశారు. చిన్న క్షేత్రాల అన్వేషణ (డీఎస్‌ఎఫ్‌) మొదటి రౌండు వేలంతో పోలిస్తే రెండో రౌండులో విజేతలైన బిడ్డర్లు రెట్టింపు పెట్టుబడులు పెట్టే అవకాశమున్నట్లు ఆయన చెప్పారు. రెండో విడత వేలంలో

మిశ్రమంగా ముగిసిన అమెరికా మార్కెట్లు..

Thursday 13th September 2018

అమెరికా మార్కెట్లు బుధవారం మిశ్రమంగా ముగిశాయి. ఎస్‌అండ్‌పీ 500, డౌజోన్స్‌ ఇండెక్స్‌లు కనిష్ట స్థాయిల నుంచి పుంజుకొని లాభాల్లోకి వచ్చాయి. అయితే నాస్‌డాక్‌ మాత్రం నష్టాల్లోనే ఉండిపోయింది. డౌజోన్స్‌ ఇండస్ట్రీయల్‌ యావరేజ్‌ 28 పాయిం‍ట్ల లాభంతో 25,999 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక ఎస్‌అండ్‌పీ 500.. 1 పాయింటు లాభంతో 2,889 పాయింట్ల వద్ద, నాస్‌డాక్‌ కంపొసిట్‌ 18 పాయింట్ల నష్టంతో 7,954 పాయింట్ల వద్ద క్లోజయ్యాయి. యాపిల్‌ కొత్త

Most from this category