STOCKS

News


మహీంద్రా నుంచి ఎలక్ట్రిక్‌ కిక్‌ స్కూటర్లు !

Wednesday 21st November 2018
auto-mobiles_main1542775713.png-22246

న్యూఢిల్లీ: వాతావరణ కాలుష్యం నివారణకు ఎలక్ట్రిక్‌ కిక్‌ స్కూటర్లు మంచి పరిష్కారమని మహీంద్రా గ్రూప్‌ చైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా వ్యాఖ్యానించారు. భారత్‌లోని ఢిల్లీ తదితర పెద్ద నగరాల్లో కాలుష్యం సమస్య మరింత తీవ్రమవుతోందని, దీని నుంచి గట్టెక్కేందుకు భారత్‌లో ఎలక్ట్రిక్‌ కిక్‌ స్కూటర్లను అందించే విషయమై కసరత్తు చేస్తున్నామని వివరించారు. బ్యాటరీతో నడిచే ఎలక్ట్రిక్‌ మోటార్‌తో పనిచేసే ఎలక్ట్రిక్‌ కిక్‌ స్కూటర్‌ గంటకు 25 కిమీ. దూరం గరిష్ట వేగంతో ప్రయాణిస్తుందని వివరించారు. మడవగలిగే వీలున్న ఛాసిస్‌, దీనిపై పొడవైన డెక్‌ ఉంటుందని, స్కూటర్‌ పయ్యల కంటే చిన్న సైజు పయ్యలతో ఉండే ఈ ఎలక్ట్రిక్‌ కిక్‌ స్కూటర్‌పై వ్యక్తి నిలబడి నడపాల్సి ఉంటుందని పేర్కొన్నారు. వీటిని నడపటానికి  శిక్షణ అవసరమని, వీటిని దశలవారీగా ప్రవేశపెడతామని, తగిన శిక్షణను కూడా ఇస్తామని వివరించారు. 


ఎలక్ట్రిక్‌ కిక్‌ స్కూటర్ల విషయంలో శాన్‌ఫ్రాన్సిస్కోకు చెందిన స్కూట్‌ నెటవర్క్స్‌ సంస్థ అనుభవాలను, బలాన్ని అందిపుచ్చుకోవాలనుకుంటున్నామని ఆనంద్‌ మహీంద్రా  పేర్కొన్నారు. అమెరికా, యూరప్‌ల్లో వీటి ప్రాముఖ్యత రోజు రోజుకు పెరుగుతోందని వివరించారు. ల్యాండ్‌లైన్‌ నుంచి మొబైల్‌ ఫోన్‌కు మారడం అద్భుతమైన మార్పని, అలాంటి మార్పే ఎలక్టిక్‌ కిక్‌ స్కూటర్‌ వల్ల వస్తుందన్న నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు. ప్రపంచంలో ఇదే అత్యంత ఉత్తమైన పర్యావరణ ప్రయాణ సాధనమని వివరించారు. చిన్న చిన్న గల్లీలు, బజార్లతో నిండిన మన భారత నగరాల్లో ఈ ఎలక్ట్రిక్‌ కిక్‌ స్కూటర్లే మంచి ప్రయాణ సాధనాలని వివరించారు. 


మహీంద్రా గ్రూప్‌ ఇతర ఉన్నతాధికారులు, స్కూట్‌ నెట్‌వర్క్స్‌ సీఈఓ మైకేల్‌ కీటింగ్‌తో కలిసి ఆయన కేంద్ర, ఢిల్లీ ప్రభుత్వ మంత్రులతో సమావేశమయ్యారు. ప్రభుత్వ అధికారుల నుంచి మంచి స్పందన లభించిందని ఆనంద్‌ మహీంద్రా  సంతోషం వ్యక్తం చేశారు. 



You may be interested

రూపాయికి ‘చమురు’ ఇంధనం!

Wednesday 21st November 2018

ముంబై: డాలర్‌ మారకంలో రూపాయి విలువ వరుసగా ఆరవరోజూ రికవరీ అయ్యింది. ఇంటర్‌బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్‌లో రూపాయి విలువ సోమవారం ముగింపుతో పోల్చితే 21 పైసలు బలపడింది. 71.46 వద్ద ముగిసింది. సోమవారం ముగింపు 71.67. మొత్తం ఆరు ట్రేడింగ్‌ సెషన్లలో 143 పైసలు బలపడింది. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్‌ ధరల భారీ పతనం, విదేశీ నిధుల ప్రవాహం కొనసాగుతుండడం వంటి అంశాలు రూపాయి బలోపేతానికి తక్షణ కారణాలు. అంతర్జాతీయ

హెచ్‌డీఎఫ్‌సీకి రూ.500 కోట్ల మసాలా బాండ్ల నిధులు

Wednesday 21st November 2018

న్యూఢిల్లీ: హెచ్‌డీఎఫ్‌సీ కంపెనీ మసాలా బాండ్ల జారీ ద్వారా రూ.500 కోట్లు సమీకరించింది. మీడియమ్‌ టర్మ్‌ నోట్‌ (ఎమ్‌టీఎన్‌) ప్రోగ్రామ్‌లో భాగంగా రూపీ డినామిటేడెడ్‌ బాండ్లను జారీ చేసి ఈ నిధులు సమీకరించింది. విదేశీ క్యాపిటల్‌ మార్కెట్లలో భారత కంపెనీలు జారీ చేసే ఈ బాండ్లలో స్థానిక కరెన్సీల్లో కాకుండా రూపాయల్లో మాత్రమే పెట్టుబడి పెట్టగలిగే అవకాశం ఉంటుంది. అందుకే వీటిని మసాలా బాండ్లుగా కూడా వ్యవహరిస్తున్నారు. ఈ నిధుల

Most from this category