STOCKS

News


సరికొత్త ‘శాంత్రో’ వచ్చేసింది

Wednesday 24th October 2018
auto-mobiles_main1540359885.png-21419

న్యూఢిల్లీ: వాహన ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘హ్యుందాయ్‌ శాంత్రో’ రానేవచ్చింది. హ్యుందాయ్‌ మోటార్స్‌ ఇండియా (హెచ్‌ఎంఐఎల్‌) సోమవారం ఈ హ్యాచ్‌బ్యాక్‌ను మార్కెట్‌లోకి విడుదలచేసింది. దేశీ రోడ్లపై 16 ఏళ్ల పాటు ప్రయాణించి... 2014 డిసెంబర్‌ నుంచి నిలిచిపోయిన ఈ కారు.. ఫ్యాక్టరీ నుంచే సీఎన్‌జీ ఇంధన ఆప్షన్‌, 5 స్పీడ్‌- ఆటోమేటెడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ (ఏఎంటీ), 1.1 లీటర్‌, ఫోర్‌ సిలిండర్ ఇంజిన్‌ వంటి అధునాతన ఫీచర్లతో రీ ఎంట్రీ ఇచ్చింది. 5 స్పీడ్‌- మాన్యువల్‌ వేరియంట్‌ శాంత్రో ధరల శ్రేణి రూ.3.89 లక్షలు– రూ.5.45 లక్షలు, సీఎన్‌జీ వేరియంట్స్‌ ధరలు రూ.5.23 –రూ.5.64 లక్షల మధ్య ఉండగా, ఆటోమేటెడ్ గేర్ షిఫ్ట్ ధరలు రూ.5.18 లక్షలు–రూ.5.46 లక్షల మధ్య ఉన్నట్లు కంపెనీ వెల్లడించింది. పెట్రోల్‌ వెర్షన్‌ లీటర్‌కు 20.3 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందని, సీఎన్‌జీ వెర్షన్‌ కేజీకి 30.48 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుందని కంపెనీ ప్రకటించింది. 
ఒక్కరోజులో 1,000 బుకింగ్స్
ప్రారంభ ఆఫర్‌ కింద తొలి 50,000 మంది కస్టమర్లకు రూ.11,100కే కారును బుక్‌ చేసుకునే సౌకర్యాన్ని కంపెనీ ప్రకటించింది. బుకింగ్స్‌ ప్రారంభమైన 13 రోజుల్లో 23,500 ఆన్‌లైన్‌ బుకింగ్స్‌ అందినట్లు సంస్థ సీఈఓ వై.కే కూ తెలిపారు. ఒక్కరోజులో వెయ్యి బుకింగ్స్ వచ్చాయన్నారు. ‘‘నాలుగేళ్ల విరామం తరువాత మిడ్‌–కాంపాక్ట్‌ సెగ్మెంట్‌లో మరోసారి అడుగుపెట్టాం. గడిచిన మూడేళ్లలో ఈ ప్రాజెక్ట్‌ కోసం రూ.700 కోట్లను పెట్టుబడిగా పెట్టాం. నెలకు 8,000–9,000 యూనిట్లు విక్రయించాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నాం. దక్షిణ కొరియా, చెన్నైలోని పరిశోధన అభివృద్ధి (ఆర్‌ అండ్‌ డీ) కేంద్రాలు.. ఎంతో శ్రమించి నూతన శాంత్రోను, కారు ప్రియుల ఆలోచనలకు తగినట్లుగా రూపొందించాయి.’ అని వ్యాఖ్యానించారు.



You may be interested

అదానీ పోర్ట్స్‌ సెజ్‌కు రూపాయి సెగ

Wednesday 24th October 2018

న్యూఢిల్లీ: అదానీ ​‍గ్రూప్‌నకు చెందిన లాజిస్టిక్స్‌ కంపెనీ అదానీ పోర్ట్స్‌ అండ్‌ స్పెషల్‌ ఎకనామిక్‌ జోన్‌ కంపెనీ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో 38 శాతం తగ్గింది. గత క్యూ2లో రూ.992 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో 614 కోట్లకు తగ్గిందని అదానీ పోర్ట్స్‌ అండ్‌ సెజ్‌ తెలిపింది. రూపాయి పతనం కారణంగా రూ. 953 కోట్ల మార్క్‌ టు మార్కెట్‌

హైదరాబాద్‌కు మరో 15 విదేశీ దిగ్గజాలు!

Wednesday 24th October 2018

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌, ఐఓటీ వంటి కొత్త టెక్నాలజీలు ఐటీ రంగం రూపాన్ని మార్చేస్తుండటంతో ఈ రంగంలో కొత్త పెట్టుబడులకు విదేశీ దిగ్గజాలు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే ఐటీ రంగంలో తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్న హైదరాబాద్‌ను ఇందుకు వేదిక చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే దాదాపు 10 విదేశీ దిగ్గజాలు ఇక్కడ కార్యకలాపాలు ప్రారంభించేందుకు తెలంగాణ ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నాయి. ‘‘ఇవన్నీ వివిధ దశల్లో ఉన్నాయి. ఖరారు

Most from this category