STOCKS

News


సరికొత్త ప్లాటినా 110 @ రూ.49,197

Tuesday 18th December 2018
auto-mobiles_main1545109144.png-23021

న్యూఢిల్లీ: బజాజ్‌ ఆటో నుంచి నూతన వెర్షన్‌ ప్లాటినా 110 సీసీ బైక్‌ సోమవారం మార్కెట్‌లో విడుదలైంది. యాంటీ-స్కిడ్‌ బ్రేకింగ్‌ వ్యవస్థ, ట్యూబ్‌లెస్‌ టైర్లు వంటి అధునాత ఫీచర్లను కలిగిన ఈ బైక్‌ ధర రూ.49,197 (ఢిల్లీ ఎక్స్‌షోరూం)గా నిర్ణయించినట్లు కంపెనీ వెల్లడించింది. రోడ్లపై గతుకుల ఇబ్బంది అంతగా తెలియకుండా ఉండేలా అత్యాధునిక షాక్ అబ్జార్బర్స్‌ను ఏర్పాటుచేసినట్లు తెలిపింది. బైక్‌ విడుదల సందర్భంగా సంస్థ ప్రెసిడెంట్ (మోటార్ సైకిల్ బిజినెస్) ఎరిక్ వాస్ మాట్లాడుతూ.. ‘విజయవంతంగా ప్రయాణిస్తున్న ప్లాటినా 100 ఈఎస్‌ ప్రయాణానికి తాజాగా మరో బైక్‌ తోడయింది. 100 సీసీ విభాగంలో ప్రీమియం మోడల్‌ను కొరుకునే వినియోగదారులకు ఈ బైక్‌ ఒక మంచి ఆప్షన్‌గా నిలవనుంది.’ అని వ్యాఖ్యానించారు. 



You may be interested

ఆర్‌బీఐపై ప్రభుత్వ ఒత్తిళ్లతో ఆర్థిక అస్థిరత

Tuesday 18th December 2018

సింగపూర్‌: ఆర్‌బీఐపై ప్రభుత్వం అదే పనిగా చేస్తున్న తీవ్ర స్థాయి ఒత్తిడి అన్నది... బ్యాంకింగ్‌ రంగం మెరుగు కోసం చేస్తున్న గట్టి ప్రయత్నాలకు విఘాతం కలిగిస్తుందని, దీర్ఘకాలంలో ఆర్థిక అస్థిరతకు దారితీస్తుందని అంతర్జాతీయ రేటింగ్‌ సంస్థ ఎస్‌అండ్‌పీ హెచ్చరించింది. 2019 జనవరిలో జరిగే ఆర్‌బీఐ సమావేశంలో బ్యాంకింగ్‌ వ్యవస్థ నియంత్రణలో ఏవైనా మార్పులు చేస్తారేమో వేచి చూస్తున్నట్టు తెలిపింది. ఆర్‌బీఐ స్వతంత్రత సహా పలు అంశాల విషయంలో ప్రభుత్వంతో పొసగక

నిధులు మళ్లిస్తే ఆర్‌బీఐ రేటింగ్‌ తగ్గుతుంది

Tuesday 18th December 2018

 న్యూఢిల్లీ: ఆర్‌బీఐ వద్ద అధికంగా ఉన్న నిధులను కేంద్ర ప్రభుత్వానికి గనక బదిలీ చేస్తే అది కేంద్ర బ్యాంకు రేటింగ్‌ తగ్గడానికి దారితీస్తుందని మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ అభిప్రాయపడ్డారు. ఆర్‌బీఐకి ప్రస్తుతం ఏఏఏ రేటింగ్‌ ఉండగా, ఇది తగ్గితే నిధుల వ్యయాల భారం పెరిగి, ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడుతుందన్నారు. ఆర్‌బీఐ నుంచి అదనపు నిధుల బదలాయింపు కేంద్రానికి జరిగితే రేటింగ్‌ తగ్గడానికి దారితీస్తుందా? అని విలేకరులు ప్రశ్నించగా...

Most from this category