STOCKS

News


ఆల్‌టైమ్ గరిష్టానికి స్మార్ట్‌ఫోన్స్ అమ్మకాలు

Friday 16th November 2018
auto-mobiles_main1542348563.png-22086

న్యూఢిల్లీ: ఈ ఏడాది జులై-సెప్టెంబర్‌ త్రైమాసికంలో దేశీయంగా స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు ఆల్‌టైం గరిష్ట స్థాయికి చేరాయి. గతేడాది ఇదే వ్యవధితో పోలిస్తే 9.1 శాతం వృద్ధితో 4.26 కోట్లుగా నమోదయ్యాయి. మొత్తం మొబైల్ ఫోన్ మార్కెట్లో ఫీచర్ ఫోన్స్‌కి సరిసమానంగా స్మార్ట్‌ఫోన్స్‌ 50 శాతం మేర వాటా సాధించడం ఇదే తొలిసారని రీసెర్చ్ సంస్థ ఐడీసీ వెల్లడించింది. చైనా స్మార్ట్‌ఫోన్స్ తయారీ సంస్థ షావోమి అత్యధికంగా 1.17 కోట్ల యూనిట్లు, 27.3 శాతం మార్కెట్ వాటాతో అగ్రస్థానంలో నిలవగా, కొరియన్ దిగ్గజం శాంసంగ్ 96 లక్షల ఫోన్లు, 22.6 శాతం మార్కెట్ వాటాతో రెండో స్థానంలో ఉంది. ఇక వివో (45 లక్షలు, 10.5 శాతం వాటా), మైక్రోమ్యాక్స్ (29 లక్షలు, 6.9 శాతం), ఒప్పో (29 లక్షలు, 6.7 శాతం మార్కెట్ వాటా) ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. సుంకాల పెంపు, డాలర్‌ మారకం తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతున్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో స్మార్ట్‌ఫోన్స్ సంస్థలు రేట్లను పెంచే అవకాశాలు ఉన్నాయని ఐడీసీ ఇండియా అసోసియేట్ రీసెర్చ్ డైరెక్టర్ నవ్‌కేందర్ సింగ్ తెలిపారు.



You may be interested

ఎగుమతులు పెరిగినా.. వాణిజ్యలోటు భయాలు

Friday 16th November 2018

న్యూఢిల్లీ: భారత్‌ ఎగుమతులు అక్టోబర్‌లో (2017 అక్టోబర్‌తో పోల్చి) 17.86 శాతం పెరిగాయి. విలువ రూపంలో చూస్తే 26.98 బిలియన్‌ డాలర్లు. అయితే ఇదే కాలంలో దిగుమతులు భారీగా 17.62 శాతం పెరిగి 44.11 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. వెరసి ఎగుమతులు-దిగుమతులకు మధ్య నికర వ్యత్యాసం 17.13 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యింది. అక్టోబర్‌లో వాణిజ్యలోటు 14.61 బిలియన్‌ డాలర్లు.  గురువారం వాణిజ్య మంత్రిత్వశాఖ విడుదల చేసిన గణాంకాల్లో ముఖ్యాంశాలు చూస్తే... ♦ గత

భారత్‌ రేటింగ్‌ మార్చడం లేదు!

Friday 16th November 2018

న్యూఢిల్లీ: భారతదేశంలో పెట్టుబడులకు సంబంధించిన రేటింగ్‌ను యథాతథంగా కొనసాగిస్తున్నట్లు అంతర్జాతీయ రేటింగ్‌ దిగ్గజం- ఫిచ్‌ గురువారం ప్రకటించింది. ప్రస్తుతం భారత్‌కు ఫిచ్‌... స్థిర అవుట్‌లుక్‌తో ‘బీబీబీ-’ సావరిన్‌ రేటింగ్‌ ఉంది. ఇది అతి తక్కువ ఇన్వెస్ట్‌మెంట్‌ గ్రేడ్‌. 12 సంవత్సరాల నుంచీ ఇదే గ్రేడింగ్‌ను భారత్‌కు ఫిచ్‌ కొనసాగిస్తోంది. ప్రస్తుత రేటింగ్‌ను అప్‌గ్రేడ్‌ చేసే పరిస్థితి లేదని ఫిచ్‌ తాజాగా స్పష్టం చేసింది. బలహీన ద్రవ్య పరిస్థితులు ఇందుకు కారణంగా

Most from this category