STOCKS

News


మార్కెట్లోకి టీవీఎస్‌ సరికొత్త ‘వీగో’

Friday 12th October 2018
auto-mobiles_main1539318056.png-21065

న్యూఢిల్లీ: ద్విచక్ర వాహన సంస్థ టీవీఎస్‌ మోటార్స్‌ అధునాత ‘వీగో’ స్కూటర్‌ను గురువారం మార్కెట్లోకి విడుదల చేసింది. నూతన వెర్షన్‌లో 20 లీటర్ల యుటిలిటీ బాక్స్‌, స్పోర్టి వీల్-రిమ్ స్టిక్కర్స్‌, పాస్-బై స్విచ్, నిర్వహణ అవసరంలేని బ్యాటరీ వంటి నూతన ఫీచర్లు ఉన్నట్లు సంస్థ వైస్‌ ప్రెసిడెంట్ అనిరుధ్ హల్దార్ వివరించారు. 110 సీసీ, పూర్తి మెటల్‌ బాడీ, అధునాతన డిజిటల్‌ స్పీడోమీటర్‌ కలిగిన ఈ స్కూటర్‌ ధర రూ.53,027 వద్ద నిర్ణయించినట్లు తెలిపారు. ప్రత్యేకించి మారుతున్న యువత అభిరుచులకు తగినట్లుగా స్కూటర్‌ డిజైన్‌ అయిందని వ్యాఖ్యానించారు. 



You may be interested

స్వల్పంగా పెరిగిన బీఓఐ రుణ రేటు

Friday 12th October 2018

ముంబై: ప్రభుత్వ రంగంలోని బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (బీఓఐ) రుణ రేటు (ఎంసీఎల్ఆర్‌) రెండు కాలపరిమితులకు సంబంధించి అరశాతం పెరిగింది. దీనిప్రకారం- ఓవర్‌నైట్‌  (స్వల్పకాలపరిమితి) రుణ రేటు 8.05 శాతానికి పెరిగితే, నెల కాలపరిమితి రేటు 8.15 శాతానికి చేరింది. అక్టోబర్‌ 10 నుంచీ తాజా నిర్ణయం అమల్లోకి వస్తుంది. మూడు (8.30 శాతం), ఆరు (8.50 శాతం), 12 నెలల (8.60 శాతం) రుణ రేట్లలో ఎటువంటి మార్పూ

భారత్‌లో టైటానియం వరల్డ్‌ టెక్నాలజీ

Friday 12th October 2018

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: పరిశుభ్రత, ఆరోగ్య సంరక్షణ ఉత్పత్తుల తయారీలో ఉన్న మలేషియా కంపెనీ టైటానియం వరల్డ్‌ టెక్నాలజీ భారత్‌లో ఎంట్రీ ఇచ్చింది. అనుబంధ కంపెనీ అయిన స్మార్ట్‌కోట్‌ ఇండియా ద్వారా సూక్ష్మజీవులను హరించే రెండు ఉత్పత్తులను ప్రవేశపెట్టింది. సంస్థగత, పారిశ్రామిక వినియోగం కోసం స్మార్ట్‌కోట్‌ నానో, వ్యక్తిగత వినియోగం కోసం ఆర్మోర్‌-8 పేరుతో వీటిని అందుబాటులోకి తెచ్చింది. స్మార్ట్‌కోట్‌ నానో స్ప్రే చేసిన తర్వాత దాని ప్రభావం ఏడాది

Most from this category